అంతర్జాతీయం

39మంది మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 17: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడిన మరుసటి రోజే పాకిస్తాన్ భద్రతా బలగాలు శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన అణచివేత చర్యల్లో 39 మంది మిలిటెంట్లను హతమార్చాయి. సింధ్ రాష్ట్రంలో గురువారం ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ చేసిన దాడిలో 80 మంది మృతి చెందగా, సుమారు 250 మంది గాయపడిన విషయం తెలిసిందే.
గురువారం రాత్రి నుంచి జరిపిన ఆపరేషన్‌లో తాము 18 మంది ఉగ్రవాదులను హతమార్చామని పారామిలిటరి సింధ్ రేంజర్స్ చెప్పారు. వీరిలో ఏడుగురిని సెహ్వాన్ నుంచి తిరిగి వస్తున్న పారామిలిటరీ బలగాలు కథోర్‌కు సమీపంలో హైవేపై కాల్చిచంపాయి. మిగతా 11 మందిని కరాచీలో హతమార్చినట్లు రేంజర్స్ తెలిపారు. వాయవ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో 12 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పెషావర్‌లో ముగ్గురు, ఓరక్‌జాయి గిరిజన ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. బన్ను ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను, హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖుర్రం, మొహమ్మద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో మగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఒక అధికారి చెప్పారు.
ఈ కాల్పుల్లో ఒక జవాను కూడా మృతి చెందినట్టు తెలిపారు. బాలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. పంజాబ్ రాష్ట్రంలోని సర్‌గోధా జిల్లాలో మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. భద్రతా దళాలు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇతర ఉగ్రవాదులు మృతి చెందారు.
తీవ్రం కానున్న అణచివేత
పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరుకుంటోందని, అందువల్ల రానున్న రోజుల్లో ఉగ్రవాదులపై అణచివేత చర్యలు మరింత తీవ్రం అవుతాయని ఒక అధికారి చెప్పారు.