అంతర్జాతీయం

గట్టి ఆధారాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 17: జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్‌పై ఐక్యరాజ్య సమితి (ఐరాస) చేత నిషేధం విధింపచేయడానికి భారత్ చేస్తున్న కృషికి తాను మద్దతు ఇవ్వాలంటే, అతనికి వ్యతిరేకంగా ఉన్న ‘గట్టి ఆధారాల’ను తనకు అందజేయాలని చైనా సూచించింది. భారత్, చైనాల మధ్య త్వరలో వ్యూహాత్మక చర్చలు జరుగనున్న తరుణంలో చైనా మసూద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు అడగటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, చైనా కార్యనిర్వాహక ఉప విదేశాంగ మంత్రి ఝాంగ్ యెసూయి ఈ నెల 22న బీజింగ్‌లో వ్యూహాత్మక చర్చలు జరుపనున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్చలలో ఇరు పక్షాలు అంతర్జాతీయ పరిస్థితులతో పాటు ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై లోతుగా తమ దృక్పథాలను పంచుకుంటాయని ఆయన చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో మసూద్ అజర్, అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ చేరిక అంశాలు అవరోధాలుగా ఉన్నాయని వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ, అభిప్రాయ భేదాలు కేవలం సహజసిద్ధమైనవని అన్నారు. ‘త్వరలో జరుగనున్న వ్యూహాత్మక చర్చలు సహా అన్ని రకాల సంప్రదింపులు, చర్చల ద్వారా ఇరు దేశాలు తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తగ్గించుకోవడానికి, సహకారాన్ని పెంపొందించుకోవడంలో కొత్త ఏకాభిప్రాయాలను సాధించడానికి కమ్యూనికేషన్‌ను పెంచుకోగలవు’ అని జెంగ్ అన్నారు. మసూద్ అజర్‌ను ఐరాస ఉగ్రవాదిగా ప్రకటించడానికి, ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరికకు చైనా అడ్డుపడుతున్న విషయం తెలిసిందే.