అంతర్జాతీయం

ఐదు రోజుల్లో తగ్గిన బరువు 30కిలోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రపంచంలోనే అతిపెద్ద ఊబకాయురాలయిన ఎమన్ అహ్మద్ ఇక్కడి సైఫీ ఆసుపత్రిలో బరువు తగ్గే చికిత్స తీసుకుంటున్న కారణంగా కేవలం అయిదు రోజుల్లో 30 కిలోల బరువు తగ్గారు. 500 కిలోల బరువు కలిగిన ఈజిప్టుకు చెందిన ఎమన్ ఈ చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. ఎమన్ స్థూలకాయాన్ని తగ్గించడానికి ఆమెకు త్వరలో బేరియాట్రిక్ సర్జరీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలుసుకోవాలని ఉందనే ఆకాంక్షను ఎమన్ వ్యక్తం చేశారు. అధిక బరువు కారణంగా ఎమన్ 25 ఏళ్లపాటు కైరోలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయారు. కన్సల్టెంట్ బేరియాట్రిక్ సర్జన్, కార్డియాక్ సర్జన్, ఎండోక్రినాలజిస్టు, కార్డియాలజిస్టు తదితర వైద్య నిపుణులతో కూడిన బృందం ఎమన్‌కు బేరియాట్రిక్ సర్జరీ, తదితర చికిత్సలను చేయనుంది.