అంతర్జాతీయం

2.43 లక్షల డాలర్లు పలికిన హిట్లర్ ఫోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 20: జర్మన్ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణాంతక ఆదేశాలను జారీచేసేందుకు ఉపయోగించిన ఎర్ర రంగు వ్యక్తిగత టెలిఫోన్ ఏకంగా 2.43 లక్షల అమెరికా డాలర్లకు అమ్ముడుపోయింది. అమెరికాలో దీనిని వేలం వేశారు. నిర్ణయించిన కనీస ధరకంటే ఇది రెట్టింపునకుపైగా ధరకు అమ్ముడు పోవడం విశేషం. అయితే ఆ కొనుగోలుదారుడు ఎవరో వేలం నిర్వాహకులు వెల్లడించలేదు. హిట్లర్ పేరుతోపాటు స్వస్తిక్ గుర్తుతో ఉన్న ఈ టెలిఫోన్ బెర్లిన్‌లోని ఆయన బంకర్‌లో 1945లో బయల్పడింది. జర్మనీ లొంగుబాటు తర్వాత రష్యా సైనికులు ఈ టెలిఫోన్‌ను బ్రిటిష్ అధికారి సర్ రాల్ఫ్ రేనర్‌కు కానుకగా ఇచ్చారు. యుద్ధం ముగిసిన కొద్ది రోజుల తర్వాత బెర్లిన్‌ను సందర్శించిన రేనర్ అప్పటి ఫీల్డ్ మార్షల్ బర్నార్డ్ మాంట్‌గోమరీ ఆదేశాల మేరకు ఈ టెలిఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1977లో రేనర్ మృతి చెందిన తర్వాత ఈ టెలిఫోన్ వారసత్వంగా ఆయన కుమారుడు రానుల్ఫ్ రేనర్‌కు సంక్రమించిందని వేలం నిర్వాహకులు తెలిపారు.