అంతర్జాతీయం

న్యూయార్క్‌లో భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 20: వలసలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వివిధ మతాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఆదివారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద కదం తొక్కారు. మేము కూడా ముస్లింలమే అంటూ వారు ముస్లిం మతస్తులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏడు దేశాలనుంచి అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు ట్రంప్ జారీ చేసిన తాజా ఉత్తర్వులతో తీవ్రమైన అనిశ్చితి, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముస్లింలకు సంఘీభావాన్ని తెలియజేసేందుకు ఫౌండేషన్ ఫర్ ఎత్నిక్ అండర్‌స్టాండింగ్, నసాంట్రా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించాయి. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని ట్రంప్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు, నినాదాలతో హోరెత్తించారు. ముస్లిం మతస్థులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించవద్దని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రముఖ రచయిత, పారిశ్రామికవేత్త రసెల్ సైమన్స్, సినీనటి సుసాన్ సరాండన్ తదితర సెలబ్రిటీలుసహా వివిధ మతాలకు చెందిన వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న విచ్ఛిన్నకర రాజకీయాలను ముక్తకంఠంతో ఖండించారు.

చిత్రం..న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న ఆందోళనకారులు