అంతర్జాతీయం

టార్గెట్ ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 25: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రైమరీలు తుది దశకు చేరుకుంటున్న దశలో రిపబ్లికన్ పార్టీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో రియల్ ఎస్టేట్ టైకూన్, రేసులో ప్రధానంగా ముందున్న డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరించలేని ఆయన ప్రత్యర్థులు టెడ్ క్రూజ్, జాన్ కసిచ్‌లు చేతులు కలిపారు. జూలైలో క్లీవ్‌లాండ్ కనె్వన్షన్ జరగటానికి ముందే ట్రంప్‌కు అవసరమైన 1237మంది ప్రతినిధుల మద్దతు దక్కకుండా చేయాలన్నది వారిద్దరి లక్ష్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీని సమైక్య పరచి, నవంబర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని శే్వతసౌధానికి పంపించటమే తమ లక్ష్యమని వారిద్దరూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఇండియానాలో మా ప్రచారం , వనరులను గవర్నర్ కసిచ్‌కు బదలాయించటంపై దృష్టి పెడతాం. తద్వారా ఒరెగాన్, న్యూ మెక్సికోలో గట్టి పోటీ ఇవ్వటానికి అవకాశం లభిస్తుంది.’’ అని క్రజ్ ప్రచార మేనేజర్ జెఫ్ రోయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కసిచ్ ప్రచార శిబిరం కూడా అదే రకమైన ప్రకటన విడుదల చేసింది. ‘‘ ఇండియానాలో ట్రంప్‌ను నిలువరించగలిగితే క్లీవ్‌లాండ్ కనె్వన్షన్ నాటికి అవసరమైన 1237 ప్రతినిధుల మద్దతు రాకుండా నిలువరించవచ్చు’’ అని కసిచ్ మేనేజర్ జాన్ వేవర్ పేర్కొన్నారు. అయితే వీరిద్దరి కలయికను ట్రంప్ కొట్టి పారేశారు. వారు ఓటమి బాధలో ఏం చేస్తున్నారో తెలియటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.