అంతర్జాతీయం

భారత్‌పైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 28: పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విమానాలను అది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కాక భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందేమోనన్న భయాలు వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కూడా వారు ఒబా మా ప్రభుత్వాన్ని కోరారు. ‘ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని నాతో పాటుగా కాంగ్రెస్ (పార్లమెంటు)కు చెందిన చాలా మంది సభ్యులు సీరియస్‌గా ప్రశ్నించారు. అంతేకాకుండా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. అందువల్ల పాకిస్తాన్ చెప్తున్నట్లుగా ఎఫ్-16 యుద్ధ విమానాలను టెర్రరిస్టులపై కాకుండా భారత్‌పైనే వినియోగిస్తుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి’ అని బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో విచారణ సందర్భంగా కాం గ్రెస్ సభ్యుడు మాట్ సాల్మన్ చెప్పా రు. విదేశీ వ్యవహారాల సభా కమిటీలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన సబ్ కమిటీ అఫ్గాన్, పాకిస్తాన్‌పై ఏర్పాటు చేసిన విచారణ సందర్భంగా సాల్మన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కాంగ్రెస్‌కు చెందిన చాలామంది సభ్యులు మద్దతు తెలిపారు. ఈ విచారణకు అఫ్గానిస్థాన్, పాకిస్తాన్‌కు చెందిన అమెరికా ప్రత్యేక దూత రిచర్డ్ ఓల్సన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్‌పై పోరుకోసం కాకుండా ఉగ్రవాదులను వేటాడడానికి అనువైన ఆయుధ వ్యవస్థలను అమెరికా పాక్‌కు అందజేయాలని మరో కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ అన్నారు.
సుమారు 70 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో పాక్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా సెనేట్ ప్రస్తుతం నిలిపివేసింది. కాగా, పాక్‌కు ఈ యుద్ధ విమానాలను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఈ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలియజేయాలని, అలాగే అమెరికా ప్రయోజనాలకు ఇది ఎలా మేలు చేస్తుందో చెప్పాలని సల్మాన్ ఓల్సన్‌ను ప్రశ్నించారు.
9/11 ఉగ్రవాద దాడులు జరిగినప్పటినుంచి ఇప్పటివరకు ఇనే్నళ్లుగా పాకిస్తాన్‌కు 2500 కోట్ల డాలర్లకు పైగా ఉగ్రవాద నిరోధక సహాయం అందజేసినప్పటికీ పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ నిర్భయంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వం విధానంలో ఒక సాధనంగాను, ఉగ్రవాద ముఠాలను పాక్ మిలిటరీ తరఫున భారత్‌పై ఉగ్రవాద దాడులు జరపడానికి ఉపయోగించుకుందని కూడా సాల్మన్ ఆరోపించారు. సబ్ కమిటీ చైర్‌పర్సన్ ఇలియానా లెహ్టినెన్ కూడా పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ లవిమానాలను విక్రయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాసియా ప్రాంతంలో మరింత ఎక్కువ సహకారాన్ని పొందడానికి వీలుగా పాకిస్తాన్‌కు మన మిలిటరీ విక్రయాన్ని ఉపయోగించుకోవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు ఆమె అన్నారు.