అంతర్జాతీయం

ద్వైపాక్షిక బంధానికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి జరుపుకునే కృషికి మరింత జవసత్వాలను అందిస్తుందని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ముక్తంఠంతో అభిప్రాయ పడ్డారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని ప్రధాని మోదీని ఆహ్వానించాలన్న ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రియాన్ నిర్ణయాన్ని అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం గమనార్హం. అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించాలని ప్రధాని మోదీని ఆస్వానించాలన్న స్పీకర్ రియాన్ నిర్ణయం అమెరికా, భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న కృతనిశ్చయానికి ఒక నిదర్శనమని సెనేటర్లు మార్క్ వార్నర్, జాన్ కొర్నిన్‌లు ఒక సం యుక్త ప్రకటనలో పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన వార్నర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కోర్నిన్‌లు అమెరికా సెనేట్‌లోని ఇండియా కాకస్‌కు కో- చైర్మన్‌లుగా ఉన్నారు.‘ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థతో కీలకమైన భద్రతా భాగస్వామిగా భారత్‌తో పెరుగుతున్న అమెరికా సంబంధాలు మన ఉమ్మడి ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబందాలను మెరుగుపర్చుకోవడానికి జరుపుతున్న కృషికి మరింత జవసత్వాలను చేకూర్చుకోవడానికి ఒక అవకాశం కాగలదు’ అని జూన్ 8న అమెరికా కాం గ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు రియాన్ విలేఖరులకు తెలియజేసిన తర్వాత విడుదల చేసిన ప్రకటనలో వార్నర్, కోర్నిన్‌లు పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది రియాన్ ప్రతినిధుల సభ స్పీకర్ అయిన తర్వాత అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న తొలి విదేశీ నాయకుడు మోదీ కావడం గమనార్హం. ‘్భరత దేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం, అతి త్వరలోనే అది అతి పెద్ద జనాభా కలిగిన దేశం కూడా కానున్నది. మన రెండు దేశాల మధ్య స్నేహం అత్యంత ముఖ్యమైన ప్రాంతంలో సుస్థిరతకు ఒక మూలస్తంభం, మోదీ ప్రసంగం మిత్ర దేశమైన భారత్‌తో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం కాగలదు’ అని రియాన్ అన్నారు. మన ఉమ్మడి విలువలను పెం పొందించుకోవడానికి మన రెండు దేశాలు కలిసి ఎలా కృషి చేయగలవో ప్రధాని మోదీనుంచి వినేందుకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన అన్నారు. మరో కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ కూడా రియాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది అమెరికా కాం గ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారనే విషయం తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 2014లో కూడా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా వచ్చిన మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆహ్వానించాలని అప్పటి స్పీకర్ జాన్ బోనర్‌ను కోరే కృషిని తాను ప్రారంభించానని, 80 మందికి పైగా సభ్యులు సైతం తనతో చేయి కలిపారని ఆయన చెప్పారు. 80 మంది సభ్యులు లేఖ రాయడంతో 2014 సెప్టెంబర్‌లో మోదీ వాషింగ్టన్ సందర్శించడానికి ముందు అప్పటి స్పీకర్ బోనర్ ఒక లేఖలో అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలంటూ ఆయనను ఆహ్వానించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో
భారత ప్రధాని నరేంద్రమోదీ (ఫైల్‌ఫొటో)