అంతర్జాతీయం

భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 29: భారత్‌తో సం బంధాలను మెరుగుపర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అయితే భారత్ మాత్రం కేవలం ఉగ్రవాదంపై మాట్లాడడానికే ఆసక్తి కనబరుస్తోందని, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబందాల మెరుగుకు అది ఎంతమాత్రం తోడ్పడజాలదని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ అన్నారు. ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ప్రాంతీయ సదస్సు నేపథ్యంలో ఈ నెల 26న న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరితో సమావేశం కావడానికి ఒక రోజు ముందు లోధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘విస్తృత ప్రాతిపదికన, సమగ్ర శాంతి చర్చలను తిరిగి ప్రారంభించాలని పాక్ ప్రభుత్వం పదే పదే భారత్‌ను కోరినప్పటికీ, భారత్ మాత్రం ఇంతవరకు అంగీకరించలేదని, పైగా ఉగ్రవాదం గురించి మాట్లాడడంలోనే తమకు ఆసక్తి ఉందన్న సంకేతాలను ఇస్తోందని, దౌత్య సంబంధాలుమెరుగుపడడానికి ఇది ఎంతమాత్రం దోహదపడదని లోధీ అన్నారు. కేంబ్రిడ్జిలోని హార్వర్డ్ కెన్న డీ స్కూలు నిర్వహిస్తున్న దక్షిణాసియా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 25న ఆ విద్యాసంస్థ విద్యార్థులు, అధ్యాపకులనుద్దేశించి లోధీ మాట్లాడడమే కాకుండా దక్షిణాసియా ప్రాంతం సుస్థిరతలో పాక్ పాత్ర గురించి వివరించారు. దీర్ఘకాలం గా అపరిష్కతంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ద్వారా భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని పాక్ కోరుకుంటోందని లోధీ చెప్పినట్లు ఐరాసలోని పాక్ శాశ్వత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన పేర్కొంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి అనంతరం తొలి సారిగా జరిగిన సమావేశంలో భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి దర్యాప్తు, కాశ్మీర్ సమస్య సహా పలు అంశాలపై చర్చించడం తెలిసిందే. కాశ్మీర్ సమస్యే ప్రధాన సమస్య అని పాక్ ఆ సమావేశంలో మరోసారి స్పష్టం చేసింది. కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేలా చేయడం, ఉగ్రవాదాన్ని అంతమొందించడం,పాకిస్తాన్‌లోపల, చుట్టుపక్కల హింసాత్మక ఉగ్రవాదాన్ని తుదముట్టించడం పాక్ ప్రాధాన్యతలని లోధీ అన్నారు. ప్రాం తీయ శాంతి, సుస్థిరతను నెలకొల్పడం కూడా పాక్‌కు ముఖ్యమైన విషయమని ఆమె అంటూ, దీనికి అఫ్గానిస్థాన్‌లో ఘర్షణ వాతావరణం అంతం కావడం, సమానత్వ ప్రాతిపదికపై భారత్- పాక్ సంబంధాలు మెరుగుపడడం అవసరమని చెప్పారు. చైనా గురించి మాట్లాడుతూ, పాక్ విదేశాంగ విదానానికి ఆ దేశం మూలస్తంభమని, చైనా తో పాక్ సంబంధాలు వ్యూహాత్మకమైనవి, చరిత్రాత్మకమైనవే కాక తమ దేశ విదేశాంగ విధానానికి మూలస్తంభం లాంటిదని ఆమె అన్నారు.