అంతర్జాతీయం

మానవాళి మనుగడకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 10: సాంకేతిక పురోగమనంలో చోటు చేసుకొంటున్న వేగం మానవాళిని ఎలా నాశనం చేయనుందో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకిన్స్ వివరించారు. అంతేకాదు సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా ఆయన తెలియజేశారు.
సాంకేతిక పరిజ్ఞానం మానవ జాతి ఉనికికే ముప్పుగా పరిణమించడానికి ముందే మానవాళి ఈ ముప్పులను గుర్తించి త్వరగా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనగలదన్న నమ్మకంతో కూడా ఆయన ఉన్నారు. అంతేకాదు, ఏకధ్రువ ప్రభుత్వం ఒక్కటే సాంకేతిక ముప్పునకు పరిష్కారమని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ‘నాగరికత ప్రారంభమైనప్పటినుంచి కూడా దూకుడుతనం మానవుడి మనుగడకు తోడ్పడింది. పరిణామక్రమంలో ఆ వైఖరి మన జన్యువుల్లో బలంగా నాటుకు పోయింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పురోగతి వచ్చి పడడంతో ఆ దుందుడుకు వైఖరే మన వినాశనానికి కారణం కాబోతోంది’ అని హాకిన్స్ అభిప్రాయ పడ్డారు. ఈ సాంకేతిక ముప్పును అదుపు చేయడానికి ఏదో ఒక రూపంలో ఏకధ్రువ ప్రభుత్వం ఏర్పాటు కావడమే పరిష్కారమని అభిప్రాయ పడిన హాకిన్స్ అయితే ఇది నిరంకుశత్వానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరించారు. మితిమీరిన జనాభా, వాతావరణ మార్పులు, ఇతర జాతుల అంతర్ధానాలు, అంతుబట్టని వ్యాధు లు, సముద్రాలు కలుషితం కావడం, కృత్రిమ మేధస్సులులాంటివి మానవ జాతి మనుగడకు పొంచి ఉన్న ముప్పుల్లో కొన్నని హాకిన్స్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ మానవాళి భవిష్యత్తుపై తాను ఇప్పటికీ ఆశాజనకంగానే ఉన్నట్లు హాకిన్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మానవాళికి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి మానవ జాతులన్నీ కలిసికట్టుగా కృషి చేయక తప్పదని కూడా ఆయన స్పష్టం చేశారు.