అంతర్జాతీయం

భారత్‌లో మత స్వేచ్ఛకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 2: భారత్‌లో మత సహన పరిస్థితులు క్షీణించాయని,మత స్వేచ్ఛ ఉల్లంఘనలూ పెరిగిపోయాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛ అధ్యయన నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. వివిధ మతాలకు చెందిన ప్రజలను చులకన చేస్తూ అధికారులు, మత నాయకులు చేసే ప్రకటనలు కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ విజ్ఞప్తి చేసింది. 2015లో భారత దేశంలో మత సహనం క్షీణించిందని, మతపరమైన దాడులూ తీవ్రమయ్యాయని పేర్కొన్న అమెరికా కమిషన్ తన వాదనను దన్నుగా అనేక ఇతర అంశాలనూ ప్రస్తావించింది. తమ అధ్యయన బృందానికి కూడా ఈ ఏడాది వీసాలను భారత్ తిరస్కరించిందని తెలిపింది. భారత జాతీయవాద బృందాల చేతుల్లో మైనార్టీ వర్గాలైన ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అనేక రకాలుగా వేధింపులు, అవమానాలకు గురయ్యారని తెలిపింది. మత సహనాన్ని దెబ్బతీస్తున్న ఈ బృందాలను కట్టడి చేయాల్సింది పోయి అధికార బిజెపి వీటికి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని, ఫలితంగా పరిస్థితి మరింత తీవ్రమైందని అమెరికా కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.