అంతర్జాతీయం

ఐసిస్ అధినేతపై సిఐఎ చీఫ్ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 2: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చి ఐదేళ్లు గడుస్తుండటంతో అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చీఫ్ జాన్ బ్రెన్నన్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం సిరియా, ఇరాక్‌లను కేంద్రంగా చేసుకుని నరమేథం సృష్టిస్తున్న ఐసిస్ నాయకత్వాన్ని మట్టుబెట్టగలిగితే ప్రపంచానికి ఎంతో మేలు చేయగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ప్రత్యేక బలగాలు సరిగ్గా ఐదేళ్ల క్రితం (2011 మే 2వ తేదీన) పాకిస్తాన్‌లో లాడెన్‌ను హతమార్చగా, అప్పట్లో ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఘటనలను సిఐఎ ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం విదితమే. అయితే అల్‌ఖైదా నుంచి ఇప్పటికీ ముప్పు పొంచి ఉందని, ఐసిస్ కేవలం ఒక ఉగ్రవాద గ్రూపుగానే కాకుండా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగివున్న సంస్థగా పరిగణించాల్సిన అవసరం ఉందని బ్రెన్నన్ హెచ్చరించారు. ‘అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థను మనం చాలామేరకు నాశనం చేయగలిగాం. కానీ పూర్తిగా నిర్మూలించలేదు. కనుక అది ఏమి చేయగలుగుతుందన్న దానిపై మనం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. అలాగే ఐసిస్ నుంచి మున్ముందు మనకు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. కనుక లాడెన్‌కు మాదిరిగానే ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీని కూడా మట్టుబెట్టి ఆ ఉగ్రవాద సంస్థను కూడా నాశనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని ఎన్‌బిసి చానల్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బ్రెన్నన్ ఉద్ఘాటించారు.