అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో విద్వేష దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్/కొట్టాయం, మార్చి 26: ఇటీవల కాలంలో సద్దుమణిగాయనుకున్న తరుణంలో ఆస్ట్రేలియాలో జాతి విద్వేషం చెలరేగింది. ‘‘యు బ్లడీ బ్లాక్ ఇండియన్స్’’ అని దూషిస్తూ అయిదుగురు ఆస్ట్రేలియన్లు ఓ భారతీయుడిపై దాడికి ఒడిగట్టారు. కేరళకు చెందిన లీమాక్స్ జాయ్ ఇక్కడ నర్సింగ్ కోర్సు చేస్తూ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాఫీ తాగుదామని టాస్మానియా రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చిన అతనికి ఓ బాలిక సహా అయిదుగురు టీనేజర్లు దాడి జరిపారు. ఇటీవల మెల్‌బోర్న్‌లోని ఓ చర్చిలో భారతీయ కేథలిక్ ఫాదర్‌పై దారుణంగా దాడి జరిగిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లో తనపై ఈ దాడి జరిగిందని మాక్స్ జాయ్ వెల్లడించాడు. ఓ స్టోర్ లోపల పని చేస్తున్న ఓ కార్మికుడిపై ఈ అయిదుగురు టీనేజర్లు వాదోపవాదాలకు దిగారని, అక్కడే ఉన్న తనపై దృష్టి సారించి దుర్భాషలాడారని మాక్స్ తెలిపాడు. వెంటనే అక్కడున్న వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేయటంతో అయిదుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారని, కొద్ది సేపటికి వెనక్కి వచ్చి తనపై దాడికి దిగారని మాక్స్ జాయ్ తెలిపాడు. రక్తమోడుతున్న స్థితిలోనే అతడిని రాయల్ హోబార్డ్ ఆసుపత్రిలో చేర్చారు. డిశ్చార్జి అయిన అనంతరం అతడు పోలీసులకు వెల్లడించాడు. మొదట మెక్‌డొనాల్డ్ సిబ్బందిపైనే ఆ అయిదుగురు వ్యక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, కార్ పార్క్ స్థలంలో ఆ కోపాన్ని తనపై ప్రదర్శించారని, స్టోర్‌లో కూడా దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఇప్పటికీ కూడా ఆస్ట్రేలియాలో జాతిపరమైన వ్యతిరేక ధోరణి కొనసాగుతోందని ఇక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్న భారతీయులపై దాడులు జరుగుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే పోలీసుల దృష్టికి వస్తున్నాయని పేర్కొన్నాడు. తనపై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించే విదంగా ఆస్ట్రేలియా ప్రభుత్వంపై భారత విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకురావాలన్నారు.

ఆస్ట్రేలియాలో వివక్ష దాడికి గురైన కేరళ పౌరుడు లీమాక్స్ (ఫైల్ ఫొటో)