అంతర్జాతీయం

అమెరికాలో తగ్గిపోనున్న విదేశీ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 27: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల అమెరికా వర్శిటీల్లో ఉన్నత చదువులకోసం వచ్చే విదేశీ విద్యార్థులు సంఖ్య తగ్గిపోనుంది. వీసా నిబంధనలు కఠినతరం చేయడం, జాతి విద్వేష దాడుల నేపథ్యంలో 250పైగా అమెరికా కాలేజీలు, ఆరు అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 26 శాతానికి పడిపోయాయి. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోనూ 15 శాతం పడిపోయినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
విదేశీ విద్యార్థుల దరఖాస్తులు కూడా సగటున 40 శాతం తగ్గిపోయాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చేవారిలో చైనా, భారతదేశానికి చెందిన విద్యార్థులే ఎక్కువ. చైనానుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 25 శాతం, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 32 శాతం దరఖాస్తులు పడిపోయినట్టు సర్వే బయటపెట్టింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజీ రిజిస్ట్రార్స్, అడ్మిషన్స్ ఆఫీసర్స్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, ద నేషనల్ అసోసియేషన్ ఫర్ కాలేజీ అడ్మిషన్స్ కౌన్సిలింగ్, సబ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ కాలేజీ అడ్మిషన్ కౌన్సిలింగ్ సర్వే నిర్వహించాయి. అమెరికాలో పైచదువులకోసం విదేశీ విద్యార్థులు ముఖ్యంగా చైనా, భారతీయులు, నేపాల్ ఉత్సాహం చూపిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత జరిగిన పరిణామాలు విదేశీ విద్యార్థుల్లో భయాలను సృష్టించాయి.
ఎప్పుడూ లేనంతగా వీసా మంజూరులో మార్పులు విదేశీ విద్యార్థులకు గుదిబండగా మారాయి. పోర్టులాండ్ యూనివర్శిటీలో దరఖాస్తుల రిజిస్ట్రేషన్ 27 శాతానికి పడిపోయింది.