అంతర్జాతీయం

గిల్గిత్ అక్రమణపై యుకె పార్లమెంట్‌లో తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 27: పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుల్లో గిల్గిత్ బాల్టిసాన్ ప్రాంతాన్ని అయిదో రాష్ట్రంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటన్ పార్లమెంట్‌లో కన్సర్వేటివ్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మాన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మార్చి 14న పాకిస్తాన్ చేసిన ప్రకటనపై దృష్టి సారించాలని ఈ తీర్మానంలో కోరారు. 1947 నుంచి గిల్గిత్ బాల్టిసాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తమ దేశంలో విలీనం చేసుకుంటూ అయిదో రాష్ట్రంగా ప్రకటించాలన్న ప్రయత్నాన్ని బ్రిటన్ పార్లమెంట్ తీవ్రంగా ఖండిస్తోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. భౌగోళికంగా ఈ రకమైన మార్పులకు ఒడిగట్టడం చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను అక్రమంగా నిర్మించటం కోసమేనని అందులో ఆరోపించారు. ఈ తీర్మానంపై బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఈ వారంలో సంతకాలు చేసే అవకాశం ఉంది. గిల్గిత్-బాల్టిసాన్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని సర్తాజ్ అజీజ్ కమిటీ సిఫారసు చేసిందంటూ పాకిస్తాన్ దేశీయ వ్యవహారాల మంత్రి మార్చి 14న ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్గిత్ బాల్టిసాన్‌కు ఒక ప్రత్యేక ఉనికి ఉంది. దీనికి ప్రత్యేక ప్రాంతీయ అసెంబ్లీ ఉంది. ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుఖ్వా, పంజాబ్, సింధ్‌లు నాలుగు రాష్ట్రాలుగా ఉన్నాయి. చైనా ఒత్తిడితోనే గిల్గిత్‌కు రాష్ట్ర హోదా ఇచ్చి సంపూర్ణంగా తమలో కలుపుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.