అంతర్జాతీయం

ఐరాస చర్చలకు భారత్ గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 28: ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాలను నిషేధించడంపై 20ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో జరుగుతున్న చర్చల్లో భారత్ పాల్గొనడం లేదు. పలు అగ్రరాజ్యాలు వ్యతిరేకించిన ఈ చర్చలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. అణ్వస్త్రాలను నిషేధించడం కోసం చట్టపరంగా కట్టుబడి ఉండే ఒక ఒడంబడికను సాధించడానికి ఒక సదస్సును ఏర్పాటు చేయాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి 120కి పైగా దేశాలు మద్దతు పలికాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయగా, చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఓటింగ్‌కు గైరుహాజరయ్యాయి. ఈ సదస్సుకు సంబంధించిన తొలి సెషన్ సోమవారం ప్రారంభమైంది. అణు నిరాయుధీకరణకోసం ఒక సమగ్రమైన పరికరం ఉండాలన్న ప్రపంచ దేశాల సుదీర్ఘ ఆకాంక్షను ఈ సమావేశం నెరవేరుస్తుందని తమకు నమ్మకం లేదని ఓటింగ్‌కు గైరుహాజరుపై ఇచ్చిన వివరణలో భారత్ తెలిపింది. అణు నిరాయుధీకరణకు సంబంధించి జెనీవాకు చెందిన కాన్ఫరెన్స్ ఆన్ డిసార్మమెంట్ ఒక్కటే బహుళ ప్రాతినిధ్యం కలిగిన వేదిక అని కూడా మన దేశం పేర్కొంది. అయితే అణ్వస్త్రాలను పూర్తిగా నిషేధించడానికి దోహదపడే ఒక సమగ్రమైన అణు నిరాయుధీకరణ ఒడంబడికపై చర్చలు ప్రారంభం కావడం శుభ సూచకమని కూడా భారత్ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాలను నిర్మూలించడానికి అంతర్జాతీయ వెరిఫికేషన్ అవసరమని మన దేశం అంటూ, ప్రస్తుత ప్రక్రియలో వెరిఫికేషన్ అంశం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ కారణాల చేతనే ఈ నెల 31 దాకా జరిగే చర్చల్లో పాల్గొనడం లేదని మన దేశం తెలిపింది. అయితే ఈ చర్చల్లో చోటుచేసుకునే పరిణామాలను గమనిస్తూనే ఉంటామని కూడా తెలిపింది. కాగా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా 40 దేశాలు ఈ చర్చలను వ్యతిరేకిస్తున్నాయి.