అంతర్జాతీయం

అసెంబ్లీ ఎన్నికల విజయంపై మోదీకి ట్రంప్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 28: అయిదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. అమెరికాలో ట్రంప్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకోవడం ఇది మూడోసారి. ఎన్నికల్లో విజయం సాధించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌లకు సోమవారం ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి సీన్ స్పైసర్ సోమవారం విలేఖరులకు చెప్పారు. ట్రంప్ జర్మనీ చాన్సలర్ మెర్కెల్, భారత ప్రధాని నరేంద్ర మోదీలకు ఫోన్ చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు వారిని అభినందించారని స్పైసర్ చెప్పారు. జూలైలో జర్మనీలో జరగబోయే జి-20 సదస్సు నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకొంటారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో బిజెపి పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. అలాగే జర్మనీలోని సార్లాండ్ రాష్ట్రంలో గత బుధవారం జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. గత జనవరి 24న ట్రంప్-మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన తొలి అయిదుగురు విదేశీ నేతల్లో మోదీ కూడా ఒకరు.