అంతర్జాతీయం

ఇటలీ నావికుడిని స్వదేశానికి వెళ్లనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 2: ఢిల్లీలో నాలుగేళ్లకు పైగా కాలం నుంచి నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడిని భారత్ విడుదల చేయాలని, అతన్ని స్వదేశానికి వెళ్లనివ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆర్బిట్రేషన్ కోర్టు ప్రాథమికంగా తీర్పు ఇచ్చిందని ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అయితే ఈ కేసు విచారణ ఆర్బిట్రేషన్ కోర్టులో కొనసాగుతుందని పేర్కొంది. సముద్ర దొంగలుగా భావించి కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపిన కేసులో ఈ ఇద్దరు ఇటలీ నావికులను భారత్ 2012లో అరెస్టు చేసింది. ఈ ఇద్దరిలో ఒక నావికుడు అనారోగ్యం కారణంగా ఇటలీకి తిరిగివెళ్లాడు. అయితే భారత్ మరో నావికుడు సల్వటోర్ గిరోన్‌ను విడుదల చేయడానికి తిరస్కరించింది. ఈ కేసువల్ల భారత్, ఇటలీ మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయితే హేగ్‌లోని ఐరాస పర్మనెంట్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లాలని, ఆ కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని ఇరు దేశాలు నిరుడు నిర్ణయించాయి. గిరోన్‌ను స్వదేశానికి వెళ్లనివ్వాలని ఆర్బిట్రేషన్ కోర్టు తన ప్రాథమిక తీర్పులో ఆదేశించిందని ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గిరోన్ వీలయినంత త్వరగా స్వదేశానికి రావడానికి వెంటనే భారత్‌ను సంప్రదించనున్నట్లు వెల్లడించింది. ఇద్దరు ఇటలీ నావికులకు వ్యతిరేకంగా నమోదయిన కేసులోని అంశాల సమీక్షను ఆర్బిట్రేషన్ కోర్టు కొనసాగిస్తుంది.