అంతర్జాతీయం

140మంది సైనికుల ఊచకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఏప్రిల్ 22: ఆఫ్గనిస్తాన్‌లోని ఓ సైనిక స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్‌లోని మఝర్ ఇ షరీఫ్ నగర శివార్లలోని సైనిక స్థావరంపై శుక్రవారం దాడి జరిగినట్టు రక్షణశాఖ ధృవీకరించింది. సైనిక దుస్తులు ధరించిన తాలిబన్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని, కనీసం 140 మంది సైనికులు మరణించినట్టు వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని రక్షణశాఖ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత ఎలాంటి ప్రాణనష్టం లేదని చెప్పిన అధికారులు శనివారం 140 మంది వరకూ మృతి చెందారని చెప్పారు. వాషింగ్టన్‌లోని యుఎస్ అధికారులు మాత్రం 50 మంది ఆఫ్గనిస్తాన్ సైనికులు మృతి చెందారని, అనేక మంది గాయపడ్డారని శుక్రవారమే ప్రకటించారు. సుమారు 10 మంది తాలిబన్ ఉగ్రవాదులు ఆఫ్గనిస్తాన్ సైనిక దుస్తులు ధరించి ఏకంగా సైనిక వాహనంలోనే ఆర్మీ బేస్ క్యాంప్‌లోని వచ్చేశారు. వస్తూవస్తూనే కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు ముగించుకుని వచ్చి భోజనాలు చేస్తున్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. నిరాయుధులుగా ఉన్న
సైనికుల కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. రాకెట్ ప్రపుల్డ్ గ్రెనేడ్లు, రైఫిల్స్, డిటోనెటెడ్ ఎక్స్‌ప్లోజివ్‌లతో కాల్పులకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా అసలు దాడి ఎవరు ఎవరిపై చేస్తూన్నారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తాలిబన్ ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉండడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.‘ సంఘటనా స్థలంలో పరిస్థితి చూస్తే అంతా అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం. కాల్పులు ఎవరు చేస్తున్నారో ఆ సమయంలో చెప్పలేని అనిశ్చితి ఉంది’అని కాల్పుల్లో గాయపడ్డ ఓ సైనిక అధికారి చెప్పారు. ఆ ప్రాంతమంతా తుపాకీల మోత, పేలుళ్ల శబ్దాలతో దద్గరిల్లిపోయిందని ఆయన అన్నారు. దాడి జరిగిన స్థావరం ఆఫ్గనిస్తాన్ నేషనల్ ఆర్మీ 209 బెటాలియన్‌కు చెందింది. ఉత్తర ఆఫ్గనిస్తాన్‌కు సంబంధించి సైనిక కార్యకలాపాలన్నీ అక్కడ నుంచే జరుగుతాయి.
ఇలా ఉండగా ఆర్మీ బేస్ క్యాంప్‌పై జరిగిన దాడిని తాలిబన్‌లు సమర్ధించుకున్నారు. తమ సీనియర్ నాయకులపై సైన్యం జరిపిన దాడులకు ప్రతికారంగానే దాడి చేసినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. దాడిలో పాల్గొన్న వారిలో నలుగురు తాలిబన్ సానుభూతిపరులని, గతంలో ఆఫ్గన్ సైన్యంలో పనిచేశారని ఆయన పేర్కొన్నారు. అయితే దాడికి పాల్పడింది ఎవరనేది ఏ సంస్థా ప్రకటించుకోలేదని సైన్యం తెలిపింది.‘ఆఫ్గనిస్తాన్‌లోని 209 సైనిక స్థావరంపై ఆటవిక దాడి జరిగింది. తాలిబన్ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం’అని సంకీర్ణదళాల కమాండర్(యుఎస్) జాన్ నికొల్‌సన్ ఓ అధికార ప్రకటనలో తెలిపారు.
భారత్ ఖండన
న్యూఢిల్లీ: ఆఫ్గనిస్తాన్‌లోని ఆర్మీబేస్‌పై జరిగిన తాలిబన్ల దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఫ్గనిస్తాన్ చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను దేశం నుంచి తరిమివేయడానికి ఇదే సరైన సమయం అంటూ‘దాడిలో మృతి చెందిన సైనికులకు కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం’అని భారత్ తెలిపింది.

చిత్రం..తాలిబన్ దాడులతో అప్రమత్తమైన ఆఫ్గన్ సైనిక బలగాలు