అంతర్జాతీయం

అంగారకుడిపై ఆక్సిజన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 7: అంగారక గ్రహ వాతావరణంలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) అణువులు ఉన్నాయని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. గత 40 ఏళ్లలో ఇటువంటి ఆవిష్కరణ జరగడం ఇదే తొలిసారి. మీసోస్పియర్‌గా పిలిచే అంగారక గ్రహ వాతావరణంలోని ఎగువ దొంతర (లేయర్)లో ఈ అణువులు ఉన్నాయని, అంగారకుడి నుంచి ఇతర వాయువులు బయటపడి అక్కడి వాతావరణంపై ప్రభావం చూపేందుకు ఇవి దోహదపడుతున్నాయని శాస్తవ్రేత్తలు గుర్తించారు. అంగారక గ్రహ వాతావరణ ఎగువ ప్రాంతంలో సగం మేరకు మాత్రమే ఆక్సిజన్ అణువులు ఉన్నాయని, అక్కడి వాతావరణంలో సంభవించే మార్పుల వల్లనే ఇవి ఏర్పడి ఉండవచ్చని ‘సోఫియా’ (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రానమీ)లో ఏర్పాటు చేసిన పరికరం గుర్తించింది. అరుణ గ్రహ వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్తవ్రేత్తలు మరింత విస్తృతంగా ‘సోఫియా’ను ఉపయోగిస్తున్నారు.