అంతర్జాతీయం

మరో మూడు ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: పదవి చేపట్టిన వంద రోజులకు ముందే తన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేయాలనే అత్రుతతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి, పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికి, అలాగే విదేశాలకు తరలిపోతున్న ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు. 2008లో సంభవించిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకువచ్చిన డోడ్-ఫ్రాంక్ చట్టంలోని కొన్ని అంశాలను ఆరు నెలలపాటు సమీక్షించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైనది. ఈ నిబంధనలవల్ల తమ పని కష్టమవుతోందని న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ‘వాల్‌స్ట్రీట్’ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఉత్తర్వులపై సంతకం చేయడానికి ట్రంప్ ఆర్థిక శాఖ కార్యాలయానికి స్వయంగా వెళ్లారు.

చిత్రం..కొత్త ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్