అంతర్జాతీయం

ఉగ్రవాదంతో ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 1: అణు అక్రమ రవాణాదారులు, టెర్రరిస్టులతో ప్రభుత్వ శక్తులు చేతులు కలపడం అణు భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతేకాదు ఉఅగవాదం విషయంలో తరతమ భేదాలొద్దని, ‘అతని టెర్రరిస్టు నా టెర్రరిస్టు కాదు’ అనే ధోరణి వదిలిపెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. బ్రసెల్స్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులను ప్రధాని ప్రస్తావిస్తూ ఉగ్రవాదంనుంచి అణు భద్రతకు ఎంత నిజమైన, తక్షణ ముప్పు ఉందో ఆ దాడులు చాటి చెప్పాయనిన్నారు. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ విషయంలో తాము ఇచ్చిన హామీలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని కూడా ఆయన గట్టిగా కోరారు. ప్రపంచం ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన ఉగ్రవాదానికి సంబంధించిన మూడు సమకాలీన అంశాలను మోదీ వివరిస్తూ, ఇప్పటి ఉగ్రవాదం తీవ్రమైన హింసాకాండను తన ఉనికిని చాటుకోవడానికి అస్త్రంగా వాడుకుంటోందన్నారు. ఇక రెండో అంశం మనం ఇప్పుడు ఏ గుహలోనో ఉండే వ్యక్తికోసం వెతకడం లేదని. నగరంలోనే ఒక కంప్యూటరో లేదా ఒక స్మార్ట్ఫోనో కలిగి ఉండే టెర్రరిస్టును వేటాడుతున్నాం, ప్రభుత్వంలోని శక్తులు అణు అక్రమ రవాణాదారులు టెర్రరిస్టులతో చేతులు కలపడం అన్నిటికన్నా గొప్ప ప్రమాదంగా మారుతుండడం మూడవ అంశమని ప్రధాని అన్నారు. ప్రపంచానికి ఉగ్రవాదం ఎంత ముప్పుగా పరిణమించిందో మోదీ లోతుగా విశే్లషిస్తూ, ఉగ్రవాదం ఎంతోఎదిగిపోయిందని, టెర్రరిస్టులు 21వ శతాబ్దపు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, అయితే మన స్పందనమాత్రం ఇంకా పాత పద్ధతిలోనే ఉంటోందన్నారు. అంతేకాదు ఉగ్రవాదానికి సంబంధించిన సప్లై చైన్‌లు ప్రపంచమంతా విస్తరించి ఉంటే దేశాల ప్రభుత్వాల మధ్య నిజమైన సహకారం మాత్రం అలా లేదని అణు భద్రతపై రెండు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ముందు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన విందు సందర్భంగా మాట్లాడుతూ మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఇతరుల సమస్య అని, అతని టెర్రరిస్టు నా టెర్రరిస్టు కాదనే భావనలను వదిలిపెట్టాలని మోదీ అన్నారు. ‘ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ కలిగి ఉంది. అయితే మనం మాత్రం ఈ ముప్పును తిప్పి కొట్టడానికి దేశ స్థాయిలోనే చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.
20కి పైగా దేశాల అధినేతలు హాజరయిన వైట్‌హౌస్ విందు సందర్భంగా మోదీ ఒబామా పక్క సీటులోనే కూర్చున్నారు. అణు భద్రత అనేది పూర్తిగా కట్టుబడి ఉండే ఒక జాతీయ ప్రాధాన్యతగా ఉండాలి. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రపంచ దేశాలకు తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి’ అని మోదీ అన్నారు. అణు భద్రతపై చొరవ తీసుకున్నందుకు అమెరికా అధ్యక్షుడిని మోదీ ప్రశంసిస్తూ, అణు భద్రతపై దృష్టిపెట్టడం ద్వారా ఒబామా అంతర్జాతీయ భద్రతకు గొప్ప సేవ చేస్తున్నారని అన్నారు.

చిత్రం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చట్లు