అంతర్జాతీయం

లండన్‌కు తొలి ముస్లిం మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 7: లండన్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఒక ముస్లిం మేయర్‌గా ఎన్నికై అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్ (45), అధికార పార్టీకి చెందిన ఓ బిలియనీర్ కుమారుడైన జాక్ గోల్డ్‌స్మిత్ (41)ను భారీ మెజారిటీతో ఓడించి తన సత్తా చాటుకున్నాడు. సాదిక్ ఖాన్ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక బస్సు డ్రైవర్. 8.6 మిలియన్ల జనాభా కలిగిన లండన్‌లో గత ఎనిమిదేళ్లుగా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సౌత్‌వార్క్ క్యాథడ్రిల్‌లో జరిగిన సర్వమత సమావేశంలో ఖాన్ లండన్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. లేబర్ పార్టీకి చెందిన కెన్ లివింగ్ స్టోన్, కన్సర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ తర్వాత లండన్ మేయర్‌గా నేరుగా ఎన్నియిన మూడోవ్యక్తి సాదిక్ ఖాన్ కావడం గమనార్హం. కాగా, తనను బ్రిటిష్ ముస్లింగా చెప్పుకొన్న ఖాన్ ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం సాగిస్తామని ప్రకటించారు. తన విజయాన్ని భయంపై ఆశ, విచ్ఛిన్నంపై ఐక్యత సాధించిన విజయంగా ఖాన్ అభివర్ణించారు. మొత్తం పోలయిన ఓట్లలో ఖాన్‌కు 57 శాతం ఓట్లు రాగా, గోల్డ్‌స్మిత్‌కు 45.6 శాతం ఓట్లు వచ్చాయి. లండన్‌కు సంబంధించిన నాలుగు ప్రధాన విధానాలు రవాణా, పోలీసింగ్, పర్యావరణం, హౌసింగ్, ప్రణాళికలపై ఖాన్‌కు పెత్తనం ఉంటుంది.