అంతర్జాతీయం

సార్వభౌమాధికారాన్ని ప్రతి దేశమూ గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 14: అన్ని దేశాలు కూడా ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను మరొకరు గౌరవించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. చైనా ఎంతో ఉదాత్త ఆశయంతో చేపడుతున్నట్లుగా చెబుతున్న ‘ఒకే ప్రాంతం, ఒకే రోడ్డు’ ప్రాజెక్టుపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆదివారం ఇక్కడ ప్రారంభిస్తూ జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందినప్పటికీ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లే చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణంపై నిరసనగా మన దేశం ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పావు గంట ప్రసంగంలో జీ జిన్‌పింగ్ సింధూ నాగరికత, గంగా నాగరికత సహా ప్రాచీన నాగరికతల ప్రాధాన్యత గురించి మాట్లాడినప్పటికీ వివాదాస్పద చైనా-పాక్ ఆర్థిక కారిడార్‌పై భారత్ అభ్యంతరాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే అన్ని దేశాలు కూడా ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అభివృద్ధి మార్గం, సామాజిక వ్యవస్థలు, కీలక ప్రయోజనాలు, ముఖ్యమైన ఆందోళనలను మరొకరు గౌరవించుకోవాలని ఆయన అన్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరు కాబోమని నారత్ స్పష్టం చేసిన ఒక రోజు తర్వాత జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే ఒక ప్రాజెక్టును భారత్ ఎంతమాత్రం అంగీకరించదని విదేశాంగ శాఖ ప్రతినిధి శనివారం రాత్రి చెప్పడంతోనే మన దేశం ఈ సదస్సుకు హాజరు కావడం లేదనే విషయం స్పష్టమైంది. కాగా తొలి రోజు సమావేశానికి కొంతమంది భారతీయ మేధావులు హాజరు కావడం గమనార్హం. 28 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నలుగురు ముఖ్యమంత్రులు, నలుగురు ఫెడరల్ మంత్రులతో అతిపెద్ద ప్రతినిధి బృందంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ సమావేశానికి వచ్చారు. కాగా, ‘ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ’ప్రాజెక్టును ఈ శతాబ్దపుప్రాజెక్టుగా జీ అభివర్ణించడమే కాకుండా ప్రపంచానికి శాంతిని అందించే ప్రాజెక్టని చెప్పుకొన్నారు.

చిత్రం..ఆదివారం బీజింగ్‌లో ప్రారంభమైన వన్ బెల్ట్ వన్ రోడ్ ఫోరం సదస్సుకు
హాజరైన ఆసియా, యూరప్ దేశాల ప్రతినిధుల గ్రూప్ చిత్రం