అంతర్జాతీయం

ఎలాంటి చర్చలు కావాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 16: ‘వన్‌బెల్ట్-వన్ రోడ్’ ప్రాజెక్టు విషయంలో భారత్ వైఖరిని చైనా మంగళవారం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మెగా ప్రాజెక్టులో భారత్ పాలుపంచుకుంటే తాము సంతోషిస్తామని, అయితే దీనికి సంబంధించి తమతో ఎలాంటి అర్థవంతమైన చర్చలను భారత్ కోరుకొంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. నాలుగేళ్ల క్రితం ‘వన్‌బెల్ట్ వన్ రోడ్’ ప్రాజెక్టుకోసం చర్యలు ప్రారంభించినప్పటినుంచి తాము విస్తృత సంప్రదింపులు, సంయుక్త భాగస్వామ్యం, పరస్పర ప్రయోజనాలు అనే సూత్రానికే కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. వన్‌బెల్ట్ వన్‌రోడ్‌పై భారత్‌కు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి చైనా అర్థవంతమైన చర్చలు జరపాలంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హువా చున్యింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాగ్లే ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరపాలి? చైనా ఎలాంటి సానుకూల వైఖరిని కలిగి ఉండాలి?’ అని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 14-15 తేదీల్లో చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్’ (బిఆర్‌ఎఫ్) పేరిట ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సును భారత్ బాయ్‌కాట్ చేసింది. కాగా, పాకిస్తాన్ ప్రధాని సహా 28 దేశాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 5వేల కోట్ల డాలర్ల వ్యయంతో చైనా చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తుండడం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ భారత్ ఈ సదస్సును బాయ్‌కాట్ చేసింది.