అంతర్జాతీయం

నిఘా గుట్టు విప్పిన ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 16:అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని రష్యాతో పంచుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అభియోగాలు వచ్చాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్‌రోవ్, ఆ దేశ రాయబారి సెర్గే కిస్‌లాక్‌లతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారంటూ వాషింగ్టన్ పోస్టులో సంచలన కథనాలు వెలువడ్డాయి. వీటిని ఏ మాత్రం ఖాతరు చేయని ట్రంప్ తనదైన శైలిలోనే ధిక్కార స్వరాన్ని వినిపించారు. ‘మాస్కోతో కీలక వాస్తవాలను పంచుకునే తిరుగులేని అధికారం నాకు ఉంది’అని మంగళవారం నాడిక్కడ ఉద్ఘాటించారు. గత వారం రష్యా నేతలతో ట్రంప్ జరిపిన ఈ సమావేశ వివరాలను అమెరికా ప్రస్తుత, మాజీ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ట్రంప్ వ్యవహారం శైలి వల్ల ఇస్లాం ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు సంబంధించి అమెరికా సేకరించిన కీలక నిఘా సమాచారం నీరుగారిపోయినట్టయిందని ఈ అధికారులు పేర్కొన్నట్టు వాషింగ్టన్ పోస్టు తెలిపింది. అమెరికా ప్రభుత్వంలోనే చాలా మందికి ఈ సమాచారం తెలియదని, కీలక మిత్ర దేశాలకు కూడా ఈ కీలక సమాచారం తెలియదని స్పష్టం చేసింది. ఈ కథనాలపై ట్వీట్‌లో స్పందించిన ట్రంప్ ‘వైట్‌హౌస్‌లో జరిగిన బహిరంగ సమావేశంలోనే ఈ వివరాలను రష్యాతో పంచుకోవాలని దేశాధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు నాకు పరిపూర్ణమైన అధికారం ఉంది. దీని వెనుక మానవీయ దృక్కోణం కూడా ఉంది. ఉగ్రవాదం, విమానయాన భద్రత వివరాలను రష్యాకు తెలియజేయడం వల్ల ఆ దేశం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది’అని పేర్కొన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని లీక్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ నాటి ఎఫ్‌బిఐ అధికారి కోమే సహా అధికారుల్ని కోరుతూనే ఉన్నాను’అని మరో ట్వీట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.