అంతర్జాతీయం

స్టంపుతో పొడిచి చంపాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, మే 12: క్రీడల్లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు సర్వసాధారణం. ఒక్కోసారి అవి శ్రుతిమించి ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి సైతం చేరుకుంటూ ఉంటాయి. క్రికెట్, ఫుట్‌బాల్‌లాంటి ఆటల్లో ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే ఒక యువకుడి ప్రాణాలను తీసింది. ఢాకాలోని ఓ నైబర్‌హుడ్ ప్రాంతంలో స్నేహితులంతా కలిసి మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. బాబుల్ సిక్దర్ అనే 16 ఏళ్ల బాలుడు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాట్స్‌మన్ అవుటయ్యాడంటూ పదే పదే అంపైర్‌కు అపీల్ చేయడం ఆ బ్యాట్స్‌మన్‌కు కోపం తెప్పించింది. చివరికి ‘నోబాల్’కు కూడా సిక్దర్ అపీల్ చేయడంతో ఆ బ్యాట్స్‌మన్ స్టంప్ పీకి సిక్దర్ తలపై గట్టిగా బాదాడు. మొనదేలి ఉన్న స్టంప్ తల వెనుకభాగంలో బలంగా గుచ్చుకోవడంతో సిక్దర్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయాడని స్థానిక పోలీసు అధికారి చెప్పాడు. సంఘటన తర్వాత అక్కడినుంచి పారిపోయిన బ్యాట్స్‌మన్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు.

chitram బాబుల్ సిక్దర్ మరణ వార్త విని విలపిస్తున్న కుటుంబ సభ్యులు