అంతర్జాతీయం

సామాజిక మాధ్యమాలను పర్యవేక్షించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మే 12: ఉగ్రవాదులు తమ విధ్వంసక కార్యకలాపాల పట్ల యువతను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నందు వల్ల నిజమైన, అవసరమైన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది.
ప్రజలను ఐక్యం చేయడానికి అభివృద్ధి చేసిన సామాజిక మాధ్యమాలను ఉగ్రవాదులు మునుపెన్నడూ లేని రీతిలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల దుష్ప్రచారాన్ని, సిద్ధాంతాలను తిప్పికొట్టడంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ సమాజానికి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదం వ్యాప్తి వివిధ ఖండాలలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఎదుగుదల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ సంస్థ వివిధ దేశాలకు చెందిన యువతను ఉగ్రవాదులుగా మారుస్తోందని, ఇలా మారుతున్న వారిలో అత్యధికులు విభిన్న జాతులకు, ఆర్థిక హోదాలకు చెందిన టీనేజీ పిల్లలు, సుమారు 25 సంవత్సరాల వయసు గల యువకులేనని అక్బరుద్దీన్ వివరించారు. ఐఎస్‌ఐఎస్‌లో యువత చేరడానికి దారితీస్తున్న కారణాలలోని అపరిమితమైన సంక్లిష్టతలను ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. యువత వారి ప్రధాన స్రవంతి సామాజిక, రాజకీయ, ఆర్థిక వాతావరణంలో భాగస్వాములయినప్పుడే ఛాందసవాదాన్ని నిరోధించగలమని అన్నారు. ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు తమ హింసోన్మాదాన్ని సమర్థించుకోవడానికి మతానికి తప్పుడు విశే్లషణలు, తప్పుడు భాష్యాలు చేస్తున్నాయని, వాటిని ప్రచారంలో పెడుతున్నాయని భద్రతా మండలి తన అధ్యక్ష ప్రకటనలో పేర్కొంది. అఫ్గానిస్తాన్ దౌత్యవేత్త నజీఫుల్లా సాలర్‌జయి మాట్లాడుతూ తమ దేశంలో 1994లో తాలిబన్లను పుట్టించడమే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుస్థితికి కారణమని పరోక్షంగా పాకిస్తాన్‌ను నిందించారు.