అంతర్జాతీయం

యునిసెఫ్ యువ రాయబారిగా సిరియా శరణార్థి నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, జూన్ 20: ఐరాస అనుబంధం సంస్థ యునిసెఫ్ యువ గుడ్‌విల్ (సౌహార్ధ) రాయబారిగా 19 ఏళ్ల సిరియా శరణార్థి ముజూన్ అల్‌మెల్లెహాన్‌ను నియమించారు. యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫొర్సైత్ మాట్లాడుతూ సంస్థ సౌహార్థ రాయబారిగా నియమితుడైన తొలి శరణార్థి అని స్పష్టం చేశారు. జోర్డాన్‌లోని జాట్రి శరణార్థ శిబిరంలో ఆమె ఉంటోందని వెల్లడించారు. చిన్నపిల్లల సంక్షేమంకోసం యునిసెఫ్ తరఫున పనిచేస్తానని ఆమె ప్రకటించారు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పిల్లలకు చదువు, ఆరోగ్య కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తానని ముజూన్ తెలిపారు. అంతకుముందు గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేసిన దివంగత నటి ఆడ్రీ హెప్‌బర్న్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని ఆమె వెల్లడించారు.