అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జిలో చేరికకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 14: క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ సంస్థ (ఎంటిసిఆర్) నిర్దేశించిన అర్హతలను భారత్ సాధించిందని, అణు పదార్థాల సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బి శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. భారత్‌కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో సభ్యత్వం కల్పించడాన్ని చైనా, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత సంవత్సరం భారత్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రకటనను కిర్బి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎంటిసిఆర్ విధించిన అర్హతలను భారత్ సాధించిందని, ఎన్‌ఎస్‌జిలో చేరడానికి సిద్ధంగా ఉందని ఒబామా అప్పట్లో పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం దక్కకుండా అడ్డుకోవడానికి చైనా, పాకిస్తాన్ చేతులు కలిపాయని వచ్చిన వార్తల గురించి ప్రశ్నించగా, జాన్ కిర్బి నిరుడు ఒబామా చేసిన ప్రకటనను గుర్తు చేశారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో కొత్తగా ఏ దేశాన్నయినా చేర్చుకోవడం అనేది అందులో ఇదివరకే సభ్యులుగా ఉన్నవారి అంతర్గత విషయమని జాన్ కిర్బి అన్నారు.
ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వకుండా అడ్డుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను చైనా శనివారం గట్టిగా సమర్థించుకుంది. ఏ దేశానికయినా ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించాలంటే ఆ దేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేసి ఉండడం తప్పనిసరనే తమ వాదనతో 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జిలో అనేక దేశాలు ఏకీభవిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ బీజింగ్‌లో అన్నారు.