అంతర్జాతీయం

కాశ్మీర్‌పై భారత్-పాక్ మధ్య చర్చలకు కృషి చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 20: కాశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తొలగించి చర్చలకు మార్గాన్ని సుగమం చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి చేపట్టింది. ఈ రెండు దేశాలను చర్చలకు రప్పించేందుకు తానే స్వయంగా కృషి చేస్తున్నానని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. ‘పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మూడుసార్లు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో రెండుసార్లు నేను చర్చలు జరిపాను’అని ఆయన తెలిపారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో ఐరాస ఏమీ చేయడం లేదనే వారికి ఇదే సమాధానం అని అన్నారు. ఆధీన రేఖ ప్రాంతంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అలాగే కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘన కూడా ఆందోళనకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.