అంతర్జాతీయం

ఉగ్రవాదులకు నిధులెలా వస్తున్నాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, జూన్ 22: ప్రపంచంలోనే అతిపెద్ద ఉమ్మడి సైనిక బలగాలపై పోరాడడానికి అఫ్గానిస్థాన్‌లోని ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు ఎక్కడినుంచి ఆయుధాలు, శిక్షణ, నిధులు లభిస్తున్నాయో తెలుసుకోవాలని భారత్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరింది. ‘అఫ్గానిస్థాన్‌లో హింసను రొటీన్ వ్యవహారంగా చూసే ధోరణి పెరిగి పోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు లేదా పౌర, రాజకీయ ఘర్షణల ఫలితంగా అంటూ ముద్ర వేయడం ద్వారా ఉగ్రవాద, నేరపూరిత నెట్‌వర్క్‌లు పాల్పడుతున్న ఘోరాలను పట్టించుకోవడం లేదు. అలా చేయడం ద్వారా మనం కొన్ని కీలక ప్రశ్నలను అడగలేకపోతున్నాం’ అని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం అన్నారు. భద్రతా మండలిలో అఫ్గానిస్థాన్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, శిక్షణ, నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించే అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం. ఉగ్రవాదులకు పాకిస్తాన్ శిక్షణతోపాటుగా నిధులు అందజేస్తోందని భారత్‌తోపాటుగా అఫ్గానిస్థాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్, అల్‌ఖైదా, దయేష్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు అన్నీ కూడా ఉగ్రవాద సంస్థలేనని, వాటిలో చాలా సంస్థలను ఐక్యరాజ్య సమితి నిషేధిత సంస్థలుగా ప్రకటించిందని, వాటిని ఉగ్రవాద సంస్థలుగానే చూడాలని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు అఫ్గానిస్థాన్‌లో ఆస్పత్రులు, స్కూళ్లు, అంత్యక్రియల ఊరేగింపులు, అంతర్జాతీయ అభివృద్ధి ఏజన్సీలు, దౌత్య కార్యాలయాను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌లో మానవతా చట్టాలు, మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రతికూల శక్తులతో పోరాడుతోందని, ఈ శక్తులకు, నిధులు, ఆయుధాలు పుష్కలంగా ఉండడమే కాకుండా అఫ్గానిస్థాన్‌కు వెలుపల సురక్షితమైన స్థావరాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి దక్షిణాసియా, మధ్య ఆసియాలో భద్రతకే కాకుండా ఇతర ప్రాంతాలకు సైతం ముప్పుగా పరిణమిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రదాడులను ఖండించడానికి సైతం భద్రతా మండలి వెనకాడుతుండడం పట్ల కూడా అక్బరుద్దీన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

చిత్రం.. సయ్యద్ అక్బరుద్దీన్