అంతర్జాతీయం

29మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లష్కర్ గాహ్, జూన్ 22: ఆఫ్గనిస్తాన్‌లోని లష్కర్‌గాహ్ నగరంలో ఓ బ్యాంకు వద్ద కారు బాంబు పేలి కనీసం 29 మంది మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు. రంజాన్ సందర్భంగా నగదు విత్‌డ్రా చేసుకోడానికి ప్రజలు క్యూలో ఉండగా పేలుడు సంభవించింది. న్యూ కాబూల్ బ్యాంకు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భయానంగా తయారైంది. ఈద్ సెలవుల్లో షాపింగ్ చేసుకోడానికి ఉద్యోగులు వేతనాలు విత్‌డ్రా చేసుకునేందుకు భారీగా క్యూలో నిలబడ్డారు. ‘కారు బాంబు పేలుళ్లలో 29 మంది మృతి చెందారు. 60 మంది గాయపడ్డారు’ అని బోస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి అధినేత ముల్లా డాడ్ తబిదార్ వెల్లడించారు. ఫిబ్రవరిలో కూడా లష్కర్ గాహ్‌లోని బ్యాంకు వద్ద ఈ తరహా పేలుళ్లే సంభవించాయి. అప్పటి కారుబాంబు పేలుళ్లలో ఆరుగురు సైనికులు మృతి చెందారు. హల్మాండ్ ప్రొవిన్స్‌కు లష్కర్ గాహ్ ముఖ్యపట్టణం. మిలటరీ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది. హల్మాండ్‌లో 14 జిల్లాలుండగా పదింటిలో తాలిబన్లకు గట్టిపట్టుంది. గంజాయి సాగు ఎక్కువకావడంతో తాలిబన్లకు ఇక్కడ నుంచి నిధులు బాగా వస్తాయి.

చిత్రం.. అఫ్గాన్‌లో కారుబాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో చేపడుతున్న సహాయక చర్యలు