అంతర్జాతీయం

పెట్టుబడులతో తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: అన్ని విధాలుగా వ్యాపారానుకూల దేశంగా భారత్ ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన అమెరికా కంపెనీల సీఇఓల సమావేశంలో మాట్లాడిన మోదీ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల నుంచి అమలుకానున్న జిఎస్‌టితో పెట్టుబడులకు మరింత సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఉద్ఘాటించారు. గత మూడు సంవత్సరాలుగా ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేస్తున్న గుణాత్మక విధానాల వల్ల భారత్‌లోకి అత్యధిక స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. టిమ్ కుక్ (యాపిల్), సుందర్ పిచాయ్ (గూగుల్), జాన్ చాంబర్స్ (సిస్కో), జెఫ్ బెజోస్ (అమేజాన్) సహా 20 అమెరికా కంపెనీల సీఇఓలతో మోదీ సమావేశమయ్యారు. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం తీసుకున్న వ్యాపారానుకూల నిర్ణయాల్ని వివరించడంతో పాటు రానున్న కాలంలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నదీ కూడా మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘మొత్తం ప్రపంచం భారత్ వైపే చూస్తోంది. వ్యాపారానుకూలత కోసం 7వేల సంస్కరణలు ప్రవేశ పెట్టాం. కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలనే మా ధ్యేయం’అని మోదీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెడితే ప్రయోజనాలు ఉభయతారకంగా ఉంటాయని మోదీ స్పష్టం చేశారన్నారు. తమ ప్రభుత్వం అమలు చేయబోతున్న జిఎస్‌టి అమెరికా బిజినెస్ స్కూళ్లలో అధ్యయన అంశం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. విల్లార్డ్ హోటల్‌లో గంటకు పైగా అమెరికా కంపెనీల సిఇఓలతో మాట్లాడిన మోదీ వారి డిమాండ్లను సావధానంగా విన్నారు.