అంతర్జాతీయం

150 మంది బుగ్గి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 25: రహదారిపై బోల్తాపడ్డ ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తీసుకెళ్దామన్న ఆశ 151 మంది ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని అహ్మద్‌పూర్ షర్కియాప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగింది. కరాచి నుంచి లాహోర్ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ టైరు పేలిపోవడంతో రహదారిపై బోల్తాపడింది. ఇది గమనించిన చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు ఒక్కసారిగా హైవేపైకి వచ్చి ట్యాంకర్ నుంచి వృథాగా పోతున్న పెట్రోల్‌ను పట్టుకునుందుకు పోటీ పడ్డారు. తమకు దొరికిన బాటిళ్లు, బకెట్లు, బిందెలు, సీసాల్లో పెట్రోలు పట్టుకునేందు ఎగపడ్డారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ వార్త పొక్కడంతో అక్కడి నుంచి కూడా వివిధ వాహనాలపై తమకు అందుబాటులో ఉన్న గినె్నలు, సీసాల్లో పెట్రోల్ తీసుకెళ్లేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఎవరో సిగరెట్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలంటుకుని ట్యాంకర్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే 123 మంది మంటల్లో మాడి మసైపోయారు. దాదాపు వంద మందిని దగ్గరలోని బహావల్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి, మిగిలిన వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య 150కి చేరుకుందని ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా సహకార అధికారి (డిసిఓ) రానా సలీం అఫ్జల్ తెలిపారు. పాకిస్తాన్ చరిత్రలో ఇంతటి ఘోర అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటి సారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 50వేల లీటర్ల పెట్రోల్ చుట్టుపక్కల గ్రామాలకు వరదలా ప్రవేశించడంతో ఎక్కువమంది ప్రజలు మృత్యువాత పడ్డట్టు ఆయన తెలిపారు. తాను ఇంట్లో ఉండగా తమ బంధువుపిలిచి పెట్రోల్ వృథాగా పోతోందని, గ్రామస్తులంతా పట్టుకుంటున్నారని చెప్పాడని, వెంటనే అతనితో కలిసి పెట్రోల్ ట్యాంకర్ వద్దకు వెళ్లిన వెంటనే ఒక్కసారిగా పేలుడు సంభవించిందని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు మహమ్మద్ హనీఫ్ విలేఖరుతో చెప్పాడు. ట్యాంకర్ వద్ద పెట్రోల్ పట్టుకుంటున్న వారంతా పూర్తిగా కాలిపోయారని, తాను కొంచెం దూరంగా ఉండడంతో కాలిన గాయాలతో బయటపడ గలిగానని హనీఫ్ తెలిపాడు. సంఘన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను ట్యాంకర్ వద్దకు వెళ్లవద్దని ఎంతగా వారించినా వినలేదని పోలీస్ అధికారి రజా రిఫత్ చెప్పారు. కేవలం గ్రామస్తుల అత్యాస ఆ ఊరిని వల్లకాడుగా మార్చేసింది. సంఘటనలో గాయపడిన వారికి సత్వర సాయం అందించేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హెలీకాప్టర్లను రంగంలోకి దించింది.

చిత్రం.. పాకిస్తాన్‌లో పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో కాలి బూడిదయన వాహనాలు