అంతర్జాతీయం

మోదీకి రెడ్ కార్పెట్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 21: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం చెప్పడానికి అమెరికా ఎదురుచూస్తోంది. జూన్ 8న మోదీ యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధానికి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికేందుకు స్పీకర్ పౌల్ రైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీకి అదిరిపోయేలా విందు స్పీకర్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అనేక మంది నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతారు. అమెరికా హౌస్, సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీలు సంయుక్తంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి. యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని స్పీకర్ పౌల్ రైన్ వెల్లడించారు. సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జోబిడెన్, ఒబామా కేబినెట్‌లోని మంత్రులు హాజరవుతారు. సెనెట్‌లోని రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మోదీ చేసే ప్రసంగం ప్రాముఖ్యతను సంతరించుకోబోతోంది. అధ్యక్ష ఎన్నికల వేళ ఇరు పార్టీల సభ్యుల్లో నెలకొన్న అభిప్రాయభేదాలు నేపథ్యంలో ఉమ్మడి సమావేశంలో ఓ విదేశీ అధినేత పాల్గొనడం అరుదైందని కాపిటల్ హిల్ వర్గాలు వెల్లడించాయి.
మోదీ తన పర్యటలో స్పీకర్ రైన్, హౌస్ మైనారిటీ నేత నాన్సీ పిలోసీ, సెనేట్ మెజారిటీ నేత మిట్చ్ మెకెనెల్, సెనేట్ మైనారిటీ నేత హారీ రీడ్‌తో భేటీ అవుతారు. 2005 జూన్ 19న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ప్రధానులుగా 2000 సెప్టెంబర్ 14న వాజపేయి, 1994 మే 18న పివి నరసింహరావు, 1885 జూలై 13న రాజీవ్‌గాంధీకి ఈ అరుదైన గౌరవరం దక్కింది.