అంతర్జాతీయం

లంకను ముంచెత్తిన వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 21: కుండపోత వర్షాలు, ముంచెత్తిన వరదలతో శ్రీలంక అతలాకుతలమయింది. గత పాతిక సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో అనేక నదులు పొంగిపొర్లి జనావాసాలను ముంచెత్తడం వల్ల, అనేకచోట్ల కొండ చరియలు విరిగిపడటం వల్ల 71 మంది మృతి చెందారు. మరో 127 మంది గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మంది శ్రీలంక ప్రజలను ఆదుకోవడానికి భారత్ సహా అనేక దేశాలు రంగంలోకి దిగాయి. సహాయ సామగ్రితో కొచ్చినుంచి బయల్దేరిన భారత నౌక ఐఎన్‌ఎస్ సునయన శనివారం కొలంబో రేవుకు చేరుకుందని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాలితో నింపే పడవలు, ఔట్‌బోర్డ్ మోటార్లు, డైవింగ్ సామగ్రి, ఔషధాలు, విద్యుత్ జనరేటర్లు, స్లీపింగ్ బ్యాగులతో కూడిన రెండు నౌకలు ఐఎన్‌ఎస్ సునయన, ఐఎన్‌ఎస్ సట్లెజ్, ఒక సి-17 విమానాన్ని భారత్ శుక్రవారం రాత్రి శ్రీలంకకు పంపించినట్లు అధికారులు తెలిపారు. కేగల్లె జిల్లా అరనాయకె వద్ద కొండచరియలు విరిగిపడటంతో 127 మంది జాడ తెలియడం లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ శనివారం తెలిపింది. వరద బాధితులకు ఆశ్రయం కల్పించాలని, నగదు, ఆహార పదార్థాలను అందజేయాలని దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీలంక ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తం 22 జిల్లాల్లో కలిపి 3,75,604 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సుమారు 3లక్షల మంది బాధితులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలో తలదాచుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల శ్రీలంకలో ఈ భారీ వర్షాలు కురిశాయి.
బంగ్లాదేశ్‌లో అయిదుగురు మృతి
ఢాకా: రోను తుపాను శనివారం బంగ్లాదేశ్ దక్షిణ తీరాన్ని తాకడంతో పెద్ద ఎత్తున గాలిదుమారంతో కూడిన ఎడతెరిపి లేని వానలు కురిశాయి. దీంతో వేలాది మంది బంగ్లాదేశీయులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి అయిదుగురు మృతి చెందారు. మరో వంద మంది గాయపడ్డారు. తుపాను బరిసల్- చిట్టగాంగ్ రీజియన్‌ను ఢీకొన్నప్పటికీ దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది.