అంతర్జాతీయం

120 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, మే 23: సిరియాలోని జబ్లెహ్, టార్టస్ నగరాలపై సోమవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 120 మందికిపైగా మృతి చెందారు. జబ్లెహ్ నగరంపై జరిపిన దాడుల్లో 73 మంది, టార్టస్ నగరంపై జరిపిన దాడుల్లో 48 మంది మృతి చెందారు. మధ్యధరా సముద్ర తీరంలో గల ఈ రెండు నగరాలపై ఉగ్రవాదులు ఏకకాలంలో ఏడు బాంబు దాడులకు పాల్పడ్డారని, వీటిలో ఎక్కువగా ఆత్మాహుతి దాడులే ఉన్నాయని సిరియన్ అబ్జర్వేటరి ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ గ్రూప్ తెలిపింది. 2011 మార్చిలో సిరియాలో అంతర్యుద్ధం మొదలయినప్పటి నుంచి ఈ రెండు నగరాలపై ఇంత భీకర స్థాయిలో దాడులు జరగడం ఇదే మొదటిసారని అబ్జర్వేటరి అధినేత రమీ అబ్డెల్ రహమాన్ చెప్పారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ తన అమాక్ వార్తాసంస్థ ద్వారా ప్రకటించుకుంది. జబ్లెహ్, టార్టస్ నగరాలలో ‘ఆలవైట్ ప్రజాసమూహాల’పై తమ జిహాదిస్టులు దాడులు చేశారని ఐఎస్ తెలిపింది.