అంతర్జాతీయం

షరీఫ్‌కు త్వరలో ఓపెన్‌హార్ట్ సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 28: వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ (66) మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకోనున్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకుంటున్నారు. ఆయనకు అంతా మంచి జరగాలని, క్షేమంగా తిరిగి రావాలని లక్షలాది మంది ప్రజలు దైవాన్ని ప్రార్థిస్తున్నారు’ అని మరియమ్ నవాజ్ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ 2011లో ‘ఆర్టీరియల్ ఫైబ్రిల్లేషన్ అబ్లేషన్’ అనే హృద్రోగ వ్యాధికి గురవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, అందుకే ఆయన ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకుంటున్నారని మరియమ్ వివరించింది. ఇటీవల ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతో హృద్రోగ నిపుణులు నవాజ్ షరీఫ్‌కు కొన్ని స్కానింగ్‌లు, పరీక్షలు నిర్వహించారని, ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకోవాల్సిందిగా వారు సూచించారని తెలిపారు.