అంతర్జాతీయం

జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో ఐరాసలో యోగా దివస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 28: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల ఐక్యరాజ్య సమితిలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 21న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు యోగా ఏవిధంగా ఉపకరిస్తుందన్న దానిపై ఈ ఏడాది ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జరిగే యోగా కార్యక్రమానికి జగ్గి వాసుదేవ్ సారథ్యం వహిస్తారని అక్కడి భారత శాశ్వత దౌత్యాధికారి తెలిపారు. గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.