అంతర్జాతీయం

బాలికపై కిరాతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోడిజనీరో, మే 28: మహిళలపై లైంగిక దాడులకు పరాకాష్ఠ ఈ ఘటన. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో ఒక టీనేజీ బాలికపై 33 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారం వల్ల అచేతనంగా పడిపోయిన ఆ 16 సంవత్సరాల బాలిక మరునాడు స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌రేప్‌పై కొంతమంది పురుషులు ఆన్‌లైన్‌లో జోకులు పేల్చడంతోపాటు ఒంటిమీద నూలుపోగు లేకుండా అచేతన స్థితిలో పడి ఉన్న ఆ బాలిక గ్రాఫిక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఈ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. గత శనివారం జరిగిన ఈ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు.
వీరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు మిగతా నిందితులను గుర్తించే పనిలో వారున్నారు. బ్రెజిల్‌లో మహిళలపై నేరాల తీవ్రతను ఈ సంఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ అమానుష ఘటన నేపథ్యంలో దేశాధ్యక్షుడు మిచెల్ టెమెర్ దేశంలోని అన్ని రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. ప్రత్యేకంగా మహిళలపై నేరాలను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.