అంతర్జాతీయం

చైనా చిన్నబోయంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 12: డోక్లామ్ ప్రతిష్ఠంభన విషయంలో భారత్ ‘ఎంతో పరిణితి చెందిన శక్తి’ మాదిరిగా వ్యవహరిస్తోందని, దీంతో భారత్ ముందు చైనా చిన్నబోతోందని అమెరికాకు చెందిన రక్షణ విభాగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. డోక్లామ్‌లో రోడ్డును నిర్మించేందుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా) బలగాలు చేస్తున్న ప్రయత్నాలను భారత బలగాలు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో గత 50 రోజుల నుంచి ఇరు పక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న విషయం విదితమే. ఈ సమస్య విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరును ప్రతిష్టాత్మక అమెరికా నావల్ వార్ కాలేజీ ప్రొఫెసర్ జేమ్స్ ఆర్.హోమ్స్ ప్రశంసించారు. ఈ వివాదం నుంచి భారత్ వెనకడుగు వేయడం గానీ, లేక దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అంతే దూకుడగా సమాధానం ఇవ్వడం గానీ చేయకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోందని, తద్వారా భారత్ ఎంతో పరిణితి చెందిన దేశం మాదిరిగా వ్యవహరిస్తోందని, దీంతో భారత్ ముందు చైనా వెలవెలబోతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఎంతో బలమైన పొరుగు దేశం (్భరత్)తో సరిహద్దు వివాదాన్ని సజీవంగా కొనసాగించాలని చైనా కోరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. సముద్ర జలాల్లో చైనా
దూకుడుగా వ్యవహరించాలనుకుంటే ఇరుగు పొరుగు దేశాల నుంచి దురాక్రమణలకు తావు లేకుండా భౌగోళిక సరిహద్దులను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. డోక్లామ్ ప్రతిష్ఠంభనపై అమెరికా వౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించగా, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ముందు ఇప్పటికే తలకు మించిన సమస్యలు ఉన్నాయని, అలాగే డోక్లామ్ వివాదంలో అమెరికా జోక్యాన్ని భారత్ కోరుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చని ఆయన అన్నారు. అయితే ఈ వివాదం మరింత ముదిరిన పక్షంలో భారత్‌కు అమెరికా అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, డోక్లామ్‌లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ హారీ బి.హారిస్ అన్నారు. దౌత్యమార్గాల ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.