అంతర్జాతీయం

డోక్లామ్‌లో చైనా రక్తదాన శిబిరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 17: సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఈ ప్రాంతంలో రక్తదాన, రక్త సేకరణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) ఆదేశాల మేరకు హునాన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌షాలోని ఓ ఆస్పత్రి తన బ్లడ్‌బ్యాంక్‌ను ఈ ప్రాంతంలో తిరిగి ఏర్పాటు చేసినట్లు చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్’తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రులు కూడా రక్తం వినియోగాన్ని కంట్రోల్ చేస్తున్నాయని, చాంగ్షా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌ను పిఎల్‌ఏ తిరిగి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిందని, సరఫరాలను పెంచడానికి స్థానిక ప్రభుత్వం రక్త సేకరణను చేపడుతోందని ఆస్పత్రిలోని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది. హుబీ రాష్ట్రం, గ్వాంగిజ ఝువాంగ్ స్వయంపాలిత ప్రాంతంలోని ప్రధాన ఆస్పత్రుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు వివిధ వర్గాల అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నెల 8న సిచువాన్ రాష్ట్రంలో భూకంపం రావడానికి ముందు టిబెట్ ప్రాంతం ఆస్పత్రుల్లోని రక్తం నిల్వలను వేరే ప్రాంతాలకు బదిలీ చేశారని, వాటిని తిరిగి ఇప్పుడు టిబెట్‌కు బదిలీచేసే అవకాశం ఉందని ఆ వర్గాలు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. రెండు నెలల క్రితం భూటాన్ ట్రై జంక్షన్ సమీపంలోని డోక్లామ్ ప్రాంతంలో చైనా సైన్యం రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నించగా, భారత సైన్యం అడ్డుకోవడంతో ప్రతిష్టంభన ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టంభన మొదలైనప్పటినుంచి కూడా చైనా మీడియా మన దేశంపై విష ప్రచారం చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే.