అంతర్జాతీయం

కరాచీలో ముగిసిన రూత్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, ఆగస్టు 19: కుష్ఠురోగులకు 57 ఏళ్లపాటు నిరుపమాన సేవలందించి ఈ నెల 10న మృతిచెందిన డాక్టర్ రూత్ కేథరీనా మార్తా ఫా అంత్యక్రియలు శనివారం కరాచీలోని పురాతన శ్మశాన వాటికలో జరిగాయి. అంతకుముందు రూత్ పార్థివ దేహాన్ని సెయింట్ పాట్రిక్స్ కేథడ్రల్ చర్చికి తీసుకువచ్చి పాకిస్తాన్ జాతీయ జెండాను ఉంచారు. రూత్ అంత్యక్రియల కార్యక్రమానికి పాక్ అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్, సింథ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ అలీ షా, ఆ రాష్ట్ర గవర్నర్ ముహమ్మద్ జుబైర్, ఆర్మీ చీఫ్ జనరల్ క్వమర్ జావేద్ బాజ్వా తదితరులు హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియాలు పూర్తి చేశారు. డాక్టర్ రూత్ జర్మనీ దేశానికి చెందినప్పటికీ 1960లో కరాచీ చేరుకుని అక్కడే స్థిరపడి కుష్ఠురోగుల నివారణకు విశేష కృషి చేశారు.