అంతర్జాతీయం

మానవ హక్కులపై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 2: మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై సమానత్వం, భాగస్వామ్యం ప్రాతిపదికన అమెరికాతో చర్చించడానికి భారత్ సిద్ధంగా ఉందని, అయితే దీనికి సంబంధించి ఎలాంటి ‘తీర్పుల’ను ఆమోదించబోదని భారతీయ అధికారులు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో భారతీయ అధికారులు ఈ విషయం స్పష్టం చేశారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో కొంతమంది అమెరికన్ సెనేటర్లు భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడంతో భారతీయ అధికారులు కూడా భారత్ వైఖరిని స్పష్టంగా, దృఢంగా అమెరికాకు తెలియజేశారు. ఇతర సమాజాలలో లాగానే భారత్‌లోనూ ప్రతిదీ నూటికి నూరు శాతం సవ్యంగా లేదని, దేశంలో అంతర్గతంగా సామాజిక న్యాయం, మానవ హక్కుల సమస్యలున్నాయనే విషయాన్ని సీనియర్ భారతీయ అధికారులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా యంత్రాంగంతో, చట్టసభల సభ్యులతో ఇటీవల జరిపిన సంభాషణల్లో అంగీకరించారు. భారత్‌లో సమస్యలున్నాయని, అయితే అదే సమయంలో మానవ హక్కులు లేదా మత స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగినప్పుడు వాటిని లేవనెత్తే బలమైన గొంతులు కూడా ఉన్నాయని ఒక భారతీయ అధికారి తెలిపారు. అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను కూడా భారతీయ అధికారులు ప్రస్తావించారు. అమెరికన్ సెనేటర్ బెన్ కార్డిన్ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా అమలయ్యే మితిమీరిన ఉరిశిక్షలు (జుడీషియల్ కిల్లింగ్స్), మత అసహనం ఉన్నాయని విమర్శిస్తూ ఇవి దేశం ఎదుర్కొంటున్న జాతీయ సవాళ్లని పేర్కొన్నారు.