అంతర్జాతీయం

సింధ్‌లో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 19: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు మతమార్పిడులు యథేచ్ఛగా కొనసాగుతుండటంపట్ల అమెరికా పార్లమెంటేరియన్ల గ్రూపు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌తో జరిపే చర్చల్లో ఈ అంశానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ గ్రూపు అమెరికా విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ గ్రూపు అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగపు తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్ జి.వెల్స్‌తోపాటు పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారికి ఈ 17న లేఖ రాసింది. ‘సింధ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నాయకత్వ మార్పిడి జరిగినందున ఆ దేశం పట్ల అనుసరించే విధానంపై అమెరికా సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. కనుక ఇక మీదట పాక్ ప్రభుత్వంతో మీరు జరిపే చర్చల్లో మానవ హక్కులతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం’ అని బ్రాడ్ షెర్మన్ నేతృత్వంలోని అమెరికా పార్లమెంటేరియన్ల గ్రూపు లేఖలో పేర్కొంది.