అంతర్జాతీయం

ప్రాణం తీసిన నవ్వు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 20: ‘నవ్వడం ఒక భోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం’ అని అంటారు పెద్దలు. అయితే ఆ నవ్వే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చార్లెస్ ఎ హట్సన్ మిడిల్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న షరోన్ రెగోలి కిఫెర్నో సెలవు రోజులు గడిపేందుకు తన కుమార్తెతోపాటుగా మెక్సికోలోని తన స్నేహితుడి ఇంటికి వచ్చింది. సోమవారం ఇంటి రెండో అంతస్తు బాల్కనీలో ఓ బెంచ్‌పై కూర్చుని సరదాగా మాట్లాడుతూ బిగ్గరగా నవ్వసాగింది. ఎంతగా నవ్విందంటే.. ఒక్కసారిగా తల వెనక్కి వాల్చేసి నవ్వడంతో బ్యాలెన్స్ తప్పి బెంచ్‌పైనుంచి దిగువకు పడిపోయింది. ఆమె తల వెనుక భాగం, శరీరానికి తీవ్ర గాయలయ్యాయని, ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందతూ చనిపోయిందని ఆమె సోదరుడు డేవిడ్ రెగోలి చెప్పారు. మెక్సికోలో భవన నిర్మాణ ప్రమాణాలు అమెరికా అంత కఠినంగా ఉండవని, దురదృష్టవశాత్తు బాల్కనీపైన ఎలాంటి రక్షణ గోడ లేదని ఆయన చెప్పారు. సెలవు రోజులు సరదాగా వచ్చిన తన స్నేహితురాలు మృతి చెందడం తనను కలచి వేసిందని రెగోలి స్నేహితుడు చెప్పారు.