అంతర్జాతీయం

అతిసూక్ష్మ సర్జికల్ రోబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 20: ‘ఎంత సూక్ష్మమో అంత పదును’ అన్నది ఆధునిక నానుడి. పెద్ద ఫోన్లు పోయి అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్లు పుంఖాను పుంఖాన్లుగా పుట్టుకొస్తున్న యుగమిది. గ్రామ్‌ఫోన్లు, టేప్‌రికార్డర్లు, సిడిల యుగం కూడా అంతరించి అన్నిచోట్లా చిప్‌లే రాజ్యం చేస్తున్నాయి. తాజాగా వైద్య విజ్ఞానంలోనూ ఈ అతిసూక్ష్మ పరికరం నిరుపమానం కాబోతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన శాస్తవ్రేత్తలు అత్యంత సూక్ష్మమైన సర్జికల్ రోబోను తయారుచేశారు. మొబైల్ ఫోన్లలోనూ, అంతరిక్ష పరిశ్రమల్లో ఉపయోగించే తక్కువ ఖర్చయ్యే టెక్నాలజీతో వెర్సియస్ అనే ఈ రోబో తయారైంది. మనిషి చేతిని పోలిన ఈ చిన్న రోబో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను నిర్వహించగలుగుతుంది. సాంప్రదాయక ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే వైద్యపరమైన ఆ సర్జికల్ పనిని ఈ చిన్న రోబో చేసేస్తుంది. ముఖ్యంగా హెర్నియా చికిత్స, చెవి, ముక్కు, గొంతు సర్జరీలను ఈ అతిసూక్ష్మ రోబోతో సునాయాసంగా చేసేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిద్వారా చేసే సర్జరీ వల్ల ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండవని, మామూలు సర్జరీ తర్వాత ఉండే నొప్పికూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అన్నింటికంటే మించి ఈ రోబో సర్జరీ వల్ల సదరు రోగి కోలుకోవడానికి కూడా అతితక్కువ వ్యవధే పడుతున్నది అంచనా. సిడి స్క్రీన్ ద్వారా ఈ రోబోను సదరు సర్జన్ నియంత్రిస్తుంటాడు. ఎక్కడ ఆపరేషన్ అవసరమో లక్ష్యత రీతిలో ఆ భాగంలోనే దాన్ని నిర్వహించగలుగుతాడు. ప్రస్తుత సర్జరీ యంత్రాలు తీసుకునే స్పేస్‌లో మూడోవంతు భాగానే్న ఈ రోబో తీసుకుంటుందని చెబుతున్నారు. సర్జరీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలంటే ఈ తరహా రోబోలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.