అంతర్జాతీయం

తీరు మారకుంటే తాట తీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 22: ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికన్లను హతమార్చిన హింసకు ఏజంట్లయిన ఉగ్రవాద సంస్థలకు పాక్ స్వర్గ్ధామంగా మారిందని, దీన్ని అడ్డుకోకపోయినట్లయితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అధ్యక్ష హోదాలో తొలిసారిగా జాతినుద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో భారత్‌లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అనుకొంటున్నట్లు ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ అమెరికానుంచి లక్షలాది డాలర్లు సహాయంగా పొందుతోందని, అయినప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే
ఉందని ట్రంప్ అన్నారు. ‘అరాచకం, హింస, భయోత్పాతానికి ఏజంట్లయిన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అణ్వస్త్ర సంపన్న దేశాలయిన భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఉండడంతో ముప్పు మరింత తీవ్రంగా ఉంది’ అని అన్నారు. ‘అఫ్గానిస్థాన్, దక్షిణాసియాలపై అమెరికా తన వ్యూహాలను మార్చుకోవాలని నిర్ణయించుకొంది. పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఆసియా దేశాలకు ముప్పుగా మారుతున్నాయి. దీన్ని చూస్తూ మేము ఎంతోకాలం వౌనంగా ఉండలేము. పాక్ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ట్రంప్ తన ప్రసంగంలో హెచ్చరించారు. అఫ్గానిస్థాన్‌లో తమ ప్రయత్నాలలో భాగస్వామి అయితే పాక్‌కు ఎంతో లాభం కలుగుతుంది, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే అది ఎంతో నష్టపోవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో భారత్-అమెరికా సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, తమకు రక్షణ, ఆర్థిక రంగాల్లో కీలక భాగస్వామి అని ఆయన అన్నారు. తన పొరుగుదేశమైన అఫ్గానిస్థాన్‌లో శాంతి, సుస్థిరతల కోసం భారత్ చేస్తున్న కృషిని తాము అభినందిస్తున్నామని అంటూనే, ఈ కృషిని మరింతగా పెంచాలని అభిప్రాయ పడ్డారు. భారత్ అమెరికాతో వందలాది కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోందని, అందువల్ల అఫ్గానిస్థాన్ విషయంలో ముఖ్యంగా ఆర్థిక సహాయం, అభివృద్ధి విషయంలో తమకు మరింతగా సాయపడాలని కోరుకుంటున్నామన్నారు.