అంతర్జాతీయం

ఇక పాల గుళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఆగస్టు 22: తెల్లారకుండా కాఫీ తాగాలంటే పాల ప్యాకెట్ల కోసమో పాలవాడి కోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండాల్సిన అవసరం లేదంటున్నారు శాస్తవ్రేత్తలు. టీ, కాఫీ డికాక్షన్లలో కరిగిపోయి మధురమైన రీతిలో వాటి అనుభూతిని అందించే పాల క్యాప్సుల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. పంచదార గుళికలను ఏ విధంగా మనం టీ, కాఫీల్లో కలుపుతామో అలాగే ఈ పాల క్యాప్సుల్స్‌ను కూడా వాటిలో కలుపుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్యాప్సుల్స్‌వల్ల పాల ప్యాకెట్ల వినియోగం తగ్గిపోతుందని చాల తేలిగ్గానే క్షణాల్లో ఈ పానీయాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని తెలిపారు. ఈ క్యాప్సుల్స్‌లో ఘనీభవింపచేసిన పాలు ఉంటాయని షుగర్ క్యాప్సుల్ మాదిరిగానే ఇవి పనిచేస్తాయని చెప్పారు. కొంచెం వేడిగా ఉండే ఏ ద్రవరూపంలోనే ఈ క్యాప్సుల్స్ కరిగిపోతాయని జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త మార్తవెర్నల్ తెలిపారు. ఈ పాల క్యాప్సుల్స్‌ను తయారు చేయడం కూడా చాలా తేలికని ముందుగా పాలు దానికి అవసరమైన చక్కెర పరిమాణాన్ని నిర్ధారించుకోవాలని వాటినొక పరికరంలో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ వేడి చేసిన పాలు ఘనీభవించిన తరువాత, స్పటికాల రూపంలో ఏర్పడుతుందని, పంచదార, పాల ద్రావకం అందులో నిక్షిప్తమై ఉంటుందని ఆమె అన్నారు.